Wednesday, June 18, 2008

సాఫ్టువేర్ ఉద్యోగి జీవితం....

కాలేజీ లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయా, పరీక్షల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందా, ఉద్యోగంలో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామా అని తొందర పడతాం. ఉద్యోగ వేటలో నానా తిప్పలు పడి కనపడిన ప్రతి కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయి, చివరకు ఎలాగో ఉద్యోగం సంపాదిస్తాం.
ఉద్యోగంలో జాయిన్ అవుతాము...
మొదటి నెల ... పని తక్కువ.. ఎంజాయ్ ఎక్కువ... ఆల్ హాప్పీస్
రెండో నెల ... పని.. ఎంజాయ్ .. ఓ కే
మూడో నెల ... ఓన్లీ పని.. నో ఎంజాయ్ .. సమస్య మొదలు
అప్పటికే ఆఫీసు లో రాజకీయాలు తెలుస్తాయి.

పక్క టీం లో మేనేజర్ మంచివాడై ఉంటాడు,
పక్క టీం లో అమ్మాయిలు బాగుంటారు,
పక్క టీం లో జీతాలు తొందరగా పెంచుతారు,
పక్క టీం లో పని అస్సలే ఉండదు....

మనకి మాత్రం రోజూ పనే ...చేసిన పనికి, చేయని పనికి దొబ్బించుకోవడమే! ఒక్కో క్లయింట్ కి ఒక్కో రిక్వయిర్మేంట్... అవి పని చేయవు అని తెలిసినా అలాగే చేయాలి. వేలా పాలా లేని తిండి, నిద్ర... అర్ధ రాత్రి సపోర్టులు.. ఆన్ సైట్ వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది... కాని ఆఫీసులో ఇంటర్ నెట్, ఇంకా కాఫీ... ఫ్రీ అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది.

మనకీ ఒక బ్యాచ్ తయారవుతుంది... వారానికో..రెండు వారాలకో.. ఒకసారి మందు కొట్టి.. PM & TL ని తిట్టుకుంటూ అలా అలా ఒక ఆరు నెలలు గడిపేస్తాము...ఇలా లూప్ లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయి... అప్పటికే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు... మెడ నొప్పులు... వగైరా..వగైరా.. ప్చ్..
అమ్మా నాన్న, అక్కా చెల్లీ, అన్నా తమ్ముడు ని కూడా చుట్టపు చూపుగా వెళ్లి చూడాల్సి వస్తుంది... ఒక వేళ వాళ్ళూ ఇదే ఉద్యోగం ఐతే అర్థం చేసుకుంటారు...

జీతం వస్తూ ఉంటుంది, లోన్స్ , క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కి కట్టీ కట్టీ.. సంపాదించిందంతా ధారా పోస్తాము.. తెలివైనోడు ఐతే హోం లోన్స్, సేవింగ్స్ చేస్తాడు.... మనలాంటోడు ఐతే మందు, సిగరెట్, సినిమాలు..గాలి తిరుగుడు మీద తగిలేస్తాము.

ఇలా జీవితం ప్రశాంతముగా(?) సాగుతూ ఉండగా ఒకరోజు కొలీగ్ పెళ్లి సెటిల్ అయిందని పిలుస్తాడు. మనకీ ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనే ఒక వెర్రి కోరిక కలుగుతుంది. మన కంపెనీ లో అమ్మాయిలు అందరూ పెల్లైనోల్లు, ఉత్తర భారతీయులు, ఆపాటికే బుక్కైనోల్లు ఉంటారు. అక్కడే వందలో తొంభై ఐయిదు మంది.. జల్లెడ. మిగిలిన ఐదుగురిలో.. నలుగురిని అక్కా అంటే బెటర్ అనేట్లు గా ఉంటారు... మిగిలినా ఒక్క అమ్మాయి కోసం టీం అంతా ఊర కుక్కల్లా కొట్టుకుంటాము.. ఆ అమ్మాయి మాత్రం ఎవరితోనూ కమిట్ కాకుండా అందరితోనూ పబ్బం గడిపేస్తూ ఉంటుంది. ఒక మంచి రోజు తన బావ తో పెళ్లి అని అందరికి పెళ్లి పత్రికలు పంచుతుంది... ఇంకేముంది... అందరూ కలిసి ( ఇంతకు ముందు కొట్టుకున్నా...) కూర్చుని మందు కొట్టేసి ఆ అమ్మాయి మంచిది కాదు అని తీర్మానించి ... మళ్ళీ ఇంకో అమ్మాయి కోసం వేట ప్రారంభం...

ఉద్యోగం లో సమీక్షలు(రివ్యూస్) వస్తాయి, "నువ్వు ఎక్సలెంట్, నువ్వు లేనిదే కంపెనీ లేదు.. కత్తీ కమాల్.. అనీ ఊరించి ... చివర్లో బట్ " అంటారు. తీరా చూస్తే జీతంలో ఇంకో సేనక్కాయ పెంచాం పో అంటారు. మన రెస్యూమ్ ని అప్ డేట్ చేయాలి అని ఆరు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒక సారి స్మరించుకుని అలా వచ్చిన సెనగల మీద బతికేస్తుంటాము.

జీవితం అంతా దూరదర్శన్ హైదరాబాద్ ప్రసారాల లాగే గడుస్తుంది... వేరే ప్రోగ్రామ్స్ ఉండవా ?
ఛీ !!!.... వెదవ బ్రతుకు....!!!!!!



10 comments:

Anonymous said...

Chaala baaga chepparu naa problem idanDi

"పక్క టీం లో అమ్మాయిలు బాగుంటారు....."

Kathi Mahesh Kumar said...

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లోని జీవితం disconnect ని చాలా బాగా చెప్పారు. కానీ ఏంచేద్దాం...అలా సమర్పించుకున్నాక తప్పదు కదా!

Unknown said...

:))

bhale funny gaa cheppaarandi. Very True !

Anonymous said...

"తీరా చూస్తే జీతంలో ఇంకో సేనక్కాయ పెంచాం పో అంటారు. " మంచిగ చెప్పిండ్రు

Anonymous said...

ఇదాల్రెడీ బ్లాగులో ఎక్కడో చూసిన గుర్తు.

-- విహారి

Bolloju Baba said...

"తీరా చూస్తే జీతంలో ఇంకో సేనక్కాయ పెంచాం పో అంటారు. " అన్న ప్రయోగం బాగుంది.
ఓ పెద్దాయన, ఓ కవితలో "ప్రభుత్వం డి.ఏ. పెంచింది. సింహం నోట్లోకి ఈగ దూరింది. అంటూ పెరిగిన జీతాలు, సింహం వంటి జీవితావసరాల ను ఎ మేరకు తీర్చగలవనే దాన్ని చక్కగా చెప్పటం జరిగింది.
మం ఉపమానం కూడా దాని సరసన చేర్చదగినదే.
బొల్లోజు బాబా

Sujata M said...

Very Popular and Old Joke. I agree with Vihari garu. However, it is very nice to read it once again.

Anonymous said...

ఈ పొస్ట్ జ్యొతి గారు వ్రాసారు ఇక్కడ వుంది....
http://vjyothi.wordpress.com/2007/07/25/

Anonymous said...

ఓ జ్యోతి రాసిందా?? మరేం పరవాలేదు ఆమె రాసేదంతా కాపీ లని అందరికీ తెలుసు.

Anonymous said...

Hi friends,
anthaku mundu ee post evaru chesaro naaku teliyadu, idi nenu sonthamga raasinadi kaadu, edo chaduvukodaniki baavundi kadaa ani blog lo pettaananthe...

mee salahaalu & soochanalu aanadamtho sweekarishtoo....

Sri